ఐ.ఐ.టి కల్చరల్ ఫెస్టివల్ లో బాహుబలి

Bahubali
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా త్వరలో జనవరి 7నుండి 11వరకూ మద్రాస్ ఐ.ఐ.టి లో జరగనున్న కల్చరల్ ఫెస్ట్ (సారంగ్) లో పాల్గొననుంది. ఈ వేడుకలో నాలుగవ రోజున బాహుబలి చిత్ర బృందం స్పాన్సర్ చెయ్యనున్నారు. కాబట్టి బాహుబలి ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ తరుణంలో సినిమా రంగంపై ఆసక్తి వున్నవారు తమ ప్రతిభను అక్కడ చూపించే సదవకాశం లభిస్తుంది.

ఫోటో ఓప్స్, లైఫ్ సైజ్ కట్ అవుట్స్, బాహుబలి పజిల్స్ వంటి కొత్త కొత్త ప్రచార సాధనాలతో జక్కన్న బృందం సిద్ధపడుతుంది. ఈ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ లో మనముందుకు తీసుకురానున్నారు.

Exit mobile version