“బాహుబలి” మైనపు విగ్రహం విషయంలో నిర్మాత సీరియస్.!

bahubali

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా అండ్ ఇండియన్ సినిమా దగ్గర ఒక గేమ్ ఛేంజింగ్ చిత్రం “బాహుబలి” కోసం తెలిసిందే. మరి ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని అప్పట్లో భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా పై నిర్మాత శోభు యార్లగడ్డ తెరకెక్కించారు. మరి అక్కడ నుంచి ఈ చిత్రం ఎన్నో శిఖరాలు అందుకోగా ఈ చిత్రం నుంచి ప్రభాస్ పోషించిన బాహుబలి పాత్ర కూడా ఎంతో ప్రాముఖ్యత పొందింది.

అలా ప్రపంచ ప్రఖ్యాత మాడమే తుస్సాద్ లో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని పెట్టడం ఓ అరుదైన విషయం గా మారింది. అయితే ఇప్పుడు ఇదే ఇండియాలోనే ఓ ప్రాంతంలో ప్రభాస్ మైనపు బొమ్మను తయారు చేయగా ఇది పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం స్టార్ట్ చేసింది. మరి దీనిపై అయితే సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ సీరియస్ రియాక్షన్ ఇచ్చారు.

అసలు ఇలా చేయడానికి వారు మమ్మల్ని సంప్రదించడం కానీ మా అనుమతి లాంటిది ఏమి తీసుకోలేదని తెలిపారు. దీనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతున్నాను అని కాస్త సీరియస్ గానే దీనిపై స్పందించారు. దీనితో శోభు ఊహించని రియాక్షన్ ప్రభాస్ ఫ్యాన్స్ కి షాకిచ్చింది.

Exit mobile version