‘బాహుబలి’ తమిళ వర్షన్ సెన్సార్ పూర్తి

‘బాహుబలి’ తమిళ వర్షన్ సెన్సార్ పూర్తి

Published on Jul 2, 2015 7:35 PM IST

Baahubali
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ విడుదలకు దగ్గరవుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు ‘బాహుబలి’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఫస్ట్ కాపీకి సిద్ధమవుతున్న ఈ సినిమా మరో ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

ఇక తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తెలుగు వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి కాగా, తమిళ వర్షన్ సెన్సార్ ఈ సాయంత్రం పూర్తయింది. సెన్సార్ బృందం ‘బాహుబలి’ తమిళ వర్షన్‌కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్స్ ద్వారా సినిమాపై అంచనాలు ఆకాశానికి చేరడం, బాహుబలికి అన్ని చోట్లా విపరీతమైన క్రేజ్ ఉండడం.. ఇదంతా చూస్తుంటే బాహుబలి రికార్డులను తిరగరాయడానికి వస్తున్నట్టు స్పష్టమవుతూనే ఉంది.

ఇక అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండనుందనేది రాజమౌళి మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ఇప్పటికే అన్ని చోట్లా ప్రచారం మొదలుపెట్టేయగా, రాజమౌళి గత రెండు రోజుల నుంచి నేరుగా తానే ప్రచారంలోకి దిగారు. జూలై 10న విడుదల కానున్న ఈ సినిమా తమిళ వర్షన్‌ను స్టూడియో గ్రీన్ సంస్థ భారీ ఎత్తున విడుదల చేయనుంది.

తాజా వార్తలు