నేటి నుంచి ‘బాహుబలి’ తాజా షెడ్యూల్

bahubali-first-look
సౌత్ ఇండియన్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడిక్ సినిమా ‘బాహుబలి’. దాదాపు నెలకు పైగా సమ్మర్ హాలిడేస్ తీసుకున్న బాహుబలి టీం ఇటీవలే మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టింది. ఈ సమ్మర్ బ్రేక్ టైంలో నేషనల్ అవార్డు విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ సబు సైరిల్ అటు అన్నపూర్ణ స్టూడియోస్ లో, ఇటు రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ ని నిర్మించారు. గత వారం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ సెట్లో షూటింగ్ చేసారు. ఆ షెడ్యూల్ శుక్రవారంతో ముగిసింది.

బాహుబలి తాజా షెడ్యూల్ నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ సెట్లో ప్రారంభం కానుంది. ప్రభాస్, తమన్నాలతో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని సన్నివేశాలను ఈ షెడ్యూల్లో షూట్ చేయనున్నారు. సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.

ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళే రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఈ చిత్ర టీం చెబుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version