బాలీవుడ్ లో ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా అంటే ఒక సెన్సేషన్. ఈ హీరో వరుస హిట్స్ అందుకుంటూ నిర్మాతల మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. వైవిధ్యమైన సబ్జక్ట్స్ ఎంచుకొని సూపర్ హిట్స్ అందుకోవడం ఇతగాడి ప్రత్యేకత. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కే ఆయుష్మాన్ సినిమాలు మినిమమ్ వందకోట్లు కలెక్షన్స్ సాధిస్తూ నిర్మాతలకు లాభాలు పంచుతున్నాయి. తాజాగా అయన నటించిన బాలా చిత్రం కూడా సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. బాలా విడుదలైన రెండు రోజులలో 25.88కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
మొదటి రోజు 10.15 కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ నిన్న శనివారం 15.73 కోట్లు కలెక్షన్స్ తో మొదటిరోజుకు మించి రాబట్టింది. ఇక ఇవాళ ఆదివారం కావడంతో బాలా చిత్రం ఇంకా మెరుగైన వసూళ్లు అందుకొనే అవకాశం కలదు. 40కోట్లకు పైగా కలెక్షన్స్ తో బాలా మూవీ ఈ వీకెండ్ ముగిస్తుందని అంచనా. ఆయుష్మాన్ ఖురానాకు జంటగా భూమి పెడ్నేకర్, యామి గౌతమ్ నటించగా, దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించారు.


