నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కలిసి మరోసారి పనిచేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. పూరి కూడా బాలయ్యతో ఎన్ని సినిమాలైనా చేయడానికి సిద్దంగా ఉన్నానని పలు సందర్భాల్లో అన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా పనుల్లో ఉన్న పూరి తర్వాత బాలయ్య సినిమా చేయాలని నిర్ణయించుకుని కథను సిద్దం చేసుకున్నారట.
ఈ కథలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. గతంలో చేసిన ‘పైసా వసూల్’ చిత్రంలో కూడా బాలయ్యను రా ఏజెంట్ పాత్రలో ప్రెజెంట్ చేశారు పూరి. ఇక ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాలో సైతం బాలయ్య చేసేది పోలీస్ పాత్రే.
మొత్తం మీద బాలకృష్ణ చేస్తున్న, చేయనున్న సినిమాలు కాప్ స్టోరీసే కావడం విశేషం. ఇక గతంలో అనేక సార్లు పోలీస్ స్టోరీలతో బాలయ్య చేసిన సినిమాలు చాలా వరకు విజయాల్ని సాదించాయి.


