గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించడంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
అయితే, ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం తో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తాజాగా కాశీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ కాశీ విశ్వనాథుని దర్శించుకుని, డిసెంబర్ 19న మీడియాతో ముచ్చటించబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కడుతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రన్ కొనసాగిస్తోంది. ఇక ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా హర్షాలి మల్హోత్ర కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేశారు.


