లాస్ ఏంజిల్స్‌లో నాట్స్ సదస్సులో బాలకృష్ణ

లాస్ ఏంజిల్స్‌లో నాట్స్ సదస్సులో బాలకృష్ణ

Published on Jul 2, 2015 11:40 AM IST

balakrishna
తెలుగు పరిశ్రమలో టాప్ హీరో, తాజాగా హిందూపూర్ ఎమ్మెల్యేగానూ ఎన్నికైన నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రెజెన్స్ కొన్ని వేడుకలకు అందాన్ని తీసుకొస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో జరిగే నాట్స్ సదస్సులో బాలకృష్ణ పాల్గొంటున్నారు. నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.

పలు కల్చరల్, వినోద భరిత కార్యక్రమాలతో వైభవంగా జరగనున్న ఈ వేడుకలో బాలకృష్ణ మేజర్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు. ఇక ఇప్పటికే బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర లాస్ ఏంజిల్స్ చేరుకోగా ఎయిర్‌పోర్ట్‌లో బాలకృష్ణ దంపతులకు నాట్స్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఇక ఇదే వేడుకలో బాలకృష్ణతో పాటు తనికెళ్ళ భరణి, కాజల్, అలీ, గజల్ శ్రీనివాస్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొననున్నారు.

తాజా వార్తలు