రవికుమార్ కాదు, బోయపాటితోనే మూవీ అంటున్న బాలయ్య.

Published on May 29, 2019 9:00 pm IST

బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తరువాత చేయబోతున్న మూవీ “రూలర్”. కెఎస్ రవికుమార్ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది అనుకుంటున్న సమయంలో వాయిదా పడింది. దీనికి కారణం లేకపోలేదు.

ఈ సినిమాలో జగపతి బాబు విలన్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో జగపతి బాబు పాత్రను రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల కు దగ్గరగా ఉంటుంది. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో వైకాపా విజయం సాధించడంతో… ఈ సినిమా కథను మార్చాలని బాలయ్య సూచించినట్టు తెలుస్తోంది. కథలో మార్పులు చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో బోయపాటి మూవీ ని మొదలుపెట్టడానికి బాలయ్య సిద్దమయ్యాడంట. ఐతే ఈ విషయం ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి వుంది.

సంబంధిత సమాచారం :

More