నందమూరి నటసింహం బాలయ్య వేదికలలో మరియు పబ్లిక్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. కార్యక్రమం ఏదైనా తన ప్రసంగాలతో, డాన్సులతో, పాటలతో అలరిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య కలర్ ఫుల్ షర్ట్ వేసుకొని, టక్ చేసుకొని మాస్ బీట్ లో సాగే ఓ సాంగ్ కి స్టెప్స్ వేసి అక్కడి అభిమానులను అలరించారు. బాలయ్య స్టెప్స్ కి చుట్టూ ఉన్నవారు ఈలలు వేస్తూ ఎంజాయ్ చేశారు. తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన వేదాళం చిత్రంలోని ఓ మాస్ హిట్ సాంగ్ కి బాలయ్య స్టెప్స్ వేయడం జరిగింది.
ఇక బాలయ్య తాజా చిత్రం రూలర్ వచ్చే నెల 20న విడుదలకు సిద్ధమైంది. క్రిస్మస్ కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపిస్తున్నారు. టీజర్ లో దేవా అనే పోలీస్ గెటప్ లో చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఓ రేంజ్ లో పేలాయి. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె ఎస్ రవికుమార్ తెరకెక్కిస్తున్నారు. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Balayya ????????????????#RuleronDEC20 #Ruler ♥️♥️ pic.twitter.com/yX55GaAz0Q
— Gopi Nath NBK (@Balayya_Garu) November 28, 2019


