టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న బాలయ్య వ్యాఖ్యలు.

Published on May 28, 2020 11:00 pm IST

ఎన్టీఆర్ జయంతి సంధర్భంగా మీడియా ముందుకు వచ్చిన బాలకృష్ణ పెద్ద బాంబ్ పేల్చారు. ఆయన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. చిత్ర పరిశ్రమకు సంబందించిన కొన్ని కీలక సమావేశాలకు బాలకృష్ణకు ఆహ్వానం లేకపోవడమే, దీనికి కారణం అని తెలుస్తుంది. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ అసలు ఈ మీటింగ్స్ గురించి నాకు తెలియదు అన్నారు. అలాగే మంత్రి తలసానితో కలిసి వీరు భూములు పంచుకుంటున్నారా అని బాలయ్య అనడం గమనార్హం.

టాలీవుడ్ కి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా చిరంజీవి అధ్యక్షతన కొనసాగుతుంది. ఆయనే ఈ మధ్య జరిగిన అన్ని కీలక సమావేశాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. మొదట చిరంజీవి నివాసంలో మంత్రి తలసానితో చిత్ర ప్రముఖులు సమావేశం కాగా, ఆ తరువాత చిరు నేతృత్వంలోని చిత్ర ప్రముఖులు సీఎం కెసిఆర్ అని కలిశారు. మరి ఈ విషయాలలో బాలకృష్ణకు ప్రాతినిథ్యం లేకపోవడం, ఆయన తాజా వ్యాఖ్యలకు కారణం అని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More