అరకులో మొదలు కానున్న బాలకృష్ణ మూవీ

అరకులో మొదలు కానున్న బాలకృష్ణ మూవీ

Published on Jun 18, 2014 5:40 PM IST

Balakrishna
నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పటికీ తనకున్న సమయంలో కొంత సమయాన్ని సినిమాలకు కూడా ఇచ్చారు. అందులో భాగంగానే తన 98వ సినిమాని ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమా ఈ నెలాఖరు అనగా జూన్ 30న మొదలు కానుందని తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి షెడ్యూల్ అరకులో ప్రారంభం కానుంది.

బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేయగా మరో హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది. అలాగే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ లో బాలకృష్ణతో పాటు త్రిష కూడా పాల్గొననుంది. సత్యదేవ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని ‘గాడ్ సే’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. రుద్రపాటి రమణారావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు