చిరు పార్టీలో బాలయ్య కనబడలేదే…!

చిరు పార్టీలో బాలయ్య కనబడలేదే…!

Published on Nov 25, 2019 7:30 AM IST

Balakrishna Chiru

ప్రతి ఏడాది సౌత్ ఇండియాకి చెందిన నాలుగు సినీ పరిశ్రమలకు చెందిన 80’స్ స్టార్స్ ఒక చోట కలిసి వేడుక జరుపుకోవడం ఆనవాతిగా వస్తుంది. అలాగే ఈ సారి కూడా 80స్ స్టార్స్ అంతా కలిసి పండగ చేసుకున్నారు. నిన్న చిరంజీవి నివాసం వేదికగా ఈ పార్టీ గ్రాండ్‌గా జరిగింది. అంతేకాదు పార్టీకి వచ్చిన వాళ్లందర్నీ చిరు ప్రత్యేకంగా ఆహ్వానించడమే కాకుండా స్వయంగా డ్రింక్స్ కూడా సర్వ్ చేసాడని తెలుస్తుంది. ఇందులో చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి సమకాలీకులు అయిన నాగార్జున, వెంకటేష్, సుమన్, భానుచందర్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఇక తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా శరత్ కుమార్, ప్రభు లాంటి వాళ్లు వచ్చారు. మలయాళం నుంచి మోహన్ లాల్ వచ్చారు.

కన్నడ నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఇక హీరోయిన్లకు అయితే కొదవే లేదు. చాలా రోజుల తర్వాత అంతా ఒకేచోట కలుసుకున్నారు. అయితే ఎంతమంది వచ్చినా కూడా టాలీవుడ్ నుంచి బాలయ్య మిస్ అయ్యాడు. ఈ రీ యూనియన్ పార్టీలో నందమూరి బాలకృష్ణ కనిపించలేదు. ఈయన ప్రస్తుతం రూలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 20న విడుదల కానుండటంతో ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అందుకే రీ యూనియన్ పార్టీ మిస్ అయ్యాడు బాలయ్య. గతేడాది జరిగిన ఈ వేడుకలో సందడి చేసిన బాలయ్య ఈ సారి కనిపించకపోవడం, వారిని నిరాశకు గురిచేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు