నన్నూ, విశ్వక్‌ ని కవలలే అంటారు – బాలకృష్ణ

నన్నూ, విశ్వక్‌ ని కవలలే అంటారు – బాలకృష్ణ

Published on May 29, 2024 7:01 AM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. తాజాగా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన బాలకృష్ణ వేడుకని ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘ధన్యమైన జన్మనిచ్చి ప్రేక్షకులందరి హృదయాల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి నందమూరి తారక రామారావుకు ఘన నివాళులర్పించుకుంటూ, ఆయన జయంతి సందర్భంగా ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది’ బాలయ్య తెలిపారు.

బాలయ్య ఇంకా మాట్లాడుతూ.. ‘ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్నూ,
విశ్వక్‌ ని కవలలే అని అంటుంటారు. కొంతమందితోనే నేను సన్నిహితంగా ఉంటా. అందులో
విశ్వక్‌ ఒకడు. నాలాగే ఉడుకు రక్తం, దూకుడు ఉన్న వ్యక్తి. సినిమా సినిమాకీ, పాత్రల మధ్య కొత్తదనం ప్రదర్శిస్తూ ప్రయాణం చేస్తున్నాడు. గోదావరి జిల్లాల నేపథ్యంలో నేనూ సినిమాలు చేశా. గోదావరి అందాలతోపాటు, ఎంతో కిక్‌ ఇచ్చేలా ఉంది ఈ సినిమా ట్రైలర్‌. ప్రేక్షకులకు ముందుగా మనం కొత్తదనం అందించాలి. అప్పుడే వాళ్లు ఆదరిస్తారు’ అని బాలయ్య చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు