ఫ్యాక్షన్ సినిమాలకు నో చెప్పిన బాలకృష్ణ

ఫ్యాక్షన్ సినిమాలకు నో చెప్పిన బాలకృష్ణ

Published on Jun 5, 2014 5:08 PM IST

balakrishna
నందమూరి నటవారసుడు నందమూరి బాలకృష్ణకి ఫ్యాక్షన్ సినిమాలు, పవర్ఫుల్ పొలిటికల్ సినిమాలు చేయడంలో మంచి పేరుంది. ఆయన చేసిన ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘సింహా’ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్స్ సృష్టించాయి. కానీ బాలకృష్ణ మాత్రం ఇక నుంచి ఫ్యాక్షన్, పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా సినిమాలు చేయనంటున్నారు.

ఇప్పటి వరకూ సినిమాల్లోనే మెప్పించిన బాలకృష్ణ తాజాగా జరిగిన ఎన్నికల్లో హిందూపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఆయన రాజకీయ నేతగా కొనసాగుతూనే సినిమాల్లో కూడా నటించాలని నిర్ణయించుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ ‘ఇక నుంచి ఫ్యాక్షన్ మరియు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఇక నుంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించాలనుకుంటున్నానని’ తెలిపారు.

ఒక రాజకీయ వేత్తగా ఉంటూ ఫ్యాక్షన్ లేదా పొలిటికల్ సినిమాలు చేస్తే ఇతరుల నుంచి. ప్రత్యర్ధుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతోనే బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కానీ బాలకృష్ణ అభిమానులకు మాత్రం ఇది ఒక చేదు వార్తనే చెప్పాలి. ఇకపై బాలకృష్ణ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.

తాజా వార్తలు