గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇపుడు సాలిడ్ లైనప్ తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య ఈజీగా ఏడాదికి ఒకటీ రెండు సినిమాలు చేసేస్తే యంగ్ జెనరేషన్ హీరోలకి అంతకు మించిన పోటీని ఇస్తూ తన మార్కెట్ ని పెంచుకొని దూసుకెళుతున్నారు. అయితే లేటెస్ట్ గా బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న నత్త నడక ఫిల్మ్ మేకింగ్ పై కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.
అప్పట్లో ఎలాంటి టెక్నాలజీలు లేకుండానే సినిమాలు ఎంతో త్వరగా పూర్తి చేసేవాళ్ళం అని కానీ ఇప్పుడు ఎంతో మారినా కూడా సినిమాలు త్వరగా పూర్తి చెయ్యకుండా ఆలస్యం చేస్తున్నారని తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేస్తేనే డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బందులు పడకుండా ఉంటారు అన్నట్టుగా తన వెర్షన్ ని లేటెస్ట్ గా వినిపించారు. దీనితో ప్రెజెంట్ జెనరేషన్ ఫిల్మ్ మేకింగ్ పై తన డైరెక్ట్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. రీసెంట్ గానే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ కూడా ఇదే వెర్షన్ ని వినిపించిన సంగతి తెలిసిందే.
