నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఈసారి డబుల్ ట్రీట్ అందబోతోంది. ప్రతి ఏటా బాలయ్య బర్త్‌డే అప్డేట్స్ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్‌కు, ఈసారి ఒకటి కాదు.. ఏకంగా రెండు భారీ క్రేజీ ప్రాజెక్టుల నుంచి ఊహించని సర్ప్రైజ్లు రాబోతున్నాయట. దీంతో నందమూరి అభిమానుల్లో ఈ ఏడాది బర్త్‌డే వేడుకల ఉత్సాహం మరింత రెట్టింపు కానుంది.
ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ కావడం, పైగా ఇందులో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ఒక పవర్ఫుల్ అఫీషియల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది.
మరోవైపు, బాలయ్య-కొరటాల శివ కాంబినేషన్లో ఇటీవల అధికారికంగా ప్రకటించిన NBK112 ప్రాజెక్ట్ నుంచి కూడా బిగ్ అప్డేట్ రానుంది. సామాజిక అంశాలను మాస్ ఎలిమెంట్స్‌తో చూపించడంలో దిట్ట అయిన కొరటాల శివ, బాలకృష్ణ ఇమేజ్‌కు సరిపోయే పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ‘టైటిల్’ను బాలయ్య పుట్టినరోజు కానుకగా రివీల్ చేయనున్నారు. మాస్ పల్స్ తెలిసిన ఈ ఇద్దరు దర్శకుల అప్డేట్స్తో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
