ఆ స్టార్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా ?

ఆ స్టార్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా ?

Published on Dec 10, 2023 8:00 PM IST

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీపై చాలాసార్లు స్పందించారు. తన కుమారుడిని వచ్చే ఏడాది టాలీవుడ్‌లోకి హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య ప్రకటించలేదు .ఇప్పుడు ఈ దర్శకుడి పై ఒక రూమర్ వినిపిస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్ నడుస్తోంది. పైగా త్రివిక్ర‌మ్‌తో స్క్రిప్ట్ గురించి డిస్క‌ష‌న్స్ చేస్తున్నాడ‌ట బాల‌య్య‌.

మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమాకు త్రివిక్ర‌మ్ లాంటి క్లాస్ డైరెక్ట‌ర్ ట‌చ్ ఉంటే అది క‌చ్ఛితంగా ప్ల‌స్ అవుతుంద‌ని నందమూరి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మహేష్ సినిమా పూర్తి అయ్యాక, అన్ని అనుకున్నట్లు జరిగితే.. మోక్షజ్ఞ – త్రివిక్రమ్ సినిమా ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్త పై ఇంతవరకు ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు. నిజానికి 2017లోనే తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ఓ దశలో అయితే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్ అని కూడా ప్రచారం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు