నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా డిసెంబర్ నుండి మొదలవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ప్రై ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. వారిలో ఒక హీరోయిన్ గా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ను తీసుకోవాలని దర్శక నిర్మతలు అనుకుంటున్నారు.
కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారని అందులో ఒక పాత్ర, ముఖ్యమంత్రి పాత్ర అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదట. కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.
అయితే ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. మరి ప్లాప్ ల్లో ఉన్న ఈ హిట్ కాంబినేషన్ హిట్ కొడుతుందా చూడాలి.


