‘ఎఫ్ 3’ తరువాత బాలయ్యతోనే ?

Published on May 31, 2020 9:20 pm IST


టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. డైలాగ్ రైటర్ గా స్టార్ట్ అయి… వరుస సక్సెస్ లతో సూపర్ ఛాన్స్ కొట్టేసి.. డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం కామెడీ కింగ్ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి తన తరువాత సినిమాని బాలయ్యతో చేయబోతున్నాడని, ఇప్పటికే బాలకృష్ణ రావిపూడితో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది చివర్లో బాలయ్య – అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా వచ్చే అవకాశం ఉందట. కమర్షియల్ ఫార్ములాను ఫాలో అయ్యే దర్శకుల్లో ఫన్ మీద ఎక్కువగా దృష్టిపెట్టే డైరెక్టర్ అనిల్. అందుకే ఆయనకు డిమాండ్ బాగా పెరిగింది. చిన్న హీరోల దగ్గర్నుండి స్టార్ హీరోల వరకు అందరూ ఆయనతో వర్క్ చేయడానికి సిద్దంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More