బాలయ్య, బోయపాటి టీం సన్నద్ధం అవుతున్నారట.!

Published on Mar 30, 2021 4:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి అలాగే దీనిపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో కూడా అందరికీ తెలిసిందే. అయితే గత కొన్నాళ్ల నుంచి ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం టైటిల్ అనౌన్సమెంట్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి దీనికి బాలయ్య మరియు బోయపాటి టీం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రానికి ఆల్ మోస్ట్ “గాడ్ ఫాదర్” టైటిల్ ఫిక్స్ కాగా ఆ పవర్ ఫుల్ టైటిల్ ను వచ్చే ఉగాది కానుకగా మరో పవర్ ఫుల్ పోస్టర్ తో విడుదల చేసే సూచనలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆ టైం వరకు ఆగితే ఈ మాస్ కాంబో సాలిడ్ ట్రీట్ ఇవ్వడం ఖాయం అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :