సెట్స్ నుండి లీకైన బాలయ్య మరో లుక్

సెట్స్ నుండి లీకైన బాలయ్య మరో లుక్

Published on Sep 7, 2019 9:12 AM IST

బాలయ్య ప్రస్తుతం కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 105 వ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవల మలేసియా షెడ్యూల్ ముగించుకొచ్చిన చిత్ర యూనిట్ తాజా షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ లో బాలయ్యపై పోరాట సన్నివేశాలలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం.

కాగా షూటింగ్ సెట్స్ లోకి బాలయ్య ఫోటో ఒకటి లీకైంది. వెస్ట్ కోట్ ధరించి క్లాస్ లుక్ లో ఉన్న బాలకృష్ణకి దర్శకుడు రవికుమార్ సన్నివేశం వివరిస్తున్న ఆ ఫోటో వైరల్ గా మారింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాల్లయ్యకు జోడిగా సోనాల్ చౌహాన్ , వేదిక నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు