బాలయ్య మరో సాలిడ్ కాంబో ఓకే అయ్యినట్టేగా..!

Published on Feb 24, 2021 7:03 am IST

ప్రస్తుతం మన నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన ఆల్ టైం మాస్ అండ్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మరి శరవేగంగా ముగుస్తున్న ఈ చిత్రం తాలూకా షూట్ నుంచి ఇప్పుడు బాలయ్య స్వల్ప విరామంలో ఉన్నారు.

అయితే ఈ సినిమా చేస్తుండగానే బాలయ్య మరిన్ని కథలు విన్నారన్న సంగతి తెలిసిందే. మరి ఈ సమయంలోనే వినిపించిన దర్శకుడు పేరు గోపిచంద్ మలినేని. ఈ ఏడాది ఆరంభమే “క్రాక్” అనే మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ ను ఇచ్చి అదరగొట్టారు. ఇక అక్కడ నుంచి బాలయ్య తో కూడా ఒక చిత్రం ఉందని టాక్ వచ్చింది.

కానీ ఇప్పుడు మాత్రం ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అయ్యిపోయిందని తెలుస్తుంది. నిన్న దర్శకుడు చాలా సింపుల్ పోస్ట్ తోనే కన్ఫర్మ్ చేసేసారు. దీనితో ఈ కాంబో సెట్ అయ్యినట్టే ఖరారు అయ్యిపోయింది అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. మరి ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :