పోలీస్ గెటప్ లో బాలయ్య వీరవిహారం

పోలీస్ గెటప్ లో బాలయ్య వీరవిహారం

Published on Oct 26, 2019 3:51 PM IST

bala1

నందమూరి నట సింహం బాల కృష్ణ ఫ్యాన్స్ దీపావళి కానుకగా మంచి ట్రీట్ ఇచ్చారు. నేడు ఆయన టైటిల్ పోస్టర్ తో పాటు పోలీస్ లుక్ లో ఉన్న పోస్టర్ విడుదల చేసి వారిని ఫిదా చేశాడు. చేతిలో సుత్తి పట్టుకొని రౌడీ మూకలపైకి యుద్దానికి వెళుతున్నట్లు బాలయ్య గెటప్ గూస్ బమ్స్ వచ్చేదిగా ఉంది. పోలీస్ సీరియల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ మూవీలో కనిపిస్తారని ని అర్థమైంది. ఇక ఈ చిత్రానికి అందరూ అనుకున్నట్లే రూలర్ అని టైటిల్ ఫిక్స్ చేశారు.

గతంలో బాలయ్య నీట్ గా సూటు బూటు గెటప్ లో ఉన్న లుక్ విడుదల చేసిన చిత్ర బృదం నేడు పోలీసుగా పరిచయం చేయడం ఆసక్తిని రేపుతోంది. ఇక బాలయ్య ఈ చిత్రంలో రెండు భిన్న గెటప్స్ లో కనిపిస్తారని అర్థం అవుతుంది. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఛోనాల్ చౌహాన్, వేదిక బాలయ్య సరసన హీరోయిన్స్ గా నటిస్తుండగా,డిసెంబర్ 20న విడుదల కానుంది.

తాజా వార్తలు