రెండో సాంగ్ కి కూడా రెడీ అవుతోన్న ‘బాలయ్య’ !

రెండో సాంగ్ కి కూడా రెడీ అవుతోన్న ‘బాలయ్య’ !

Published on Aug 24, 2019 3:00 AM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్లు సోనాల్ చౌహాన్ అండ్ వేదిక నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం, వచ్చేవారం ఈ చిత్రంలోని రెండో సాంగ్ ను షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లో బాలయ్య – సోనాల్ చౌహాన్ పాల్గొననున్నారు. అయితే సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుందట.

గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్, డిక్టేటర్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘డిక్టేటర్’ తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాలో నమిత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు