ఎట్టకేలకూ బోయపాటి బాలయ్యను ఒప్పించాడు !

ఎట్టకేలకూ బోయపాటి బాలయ్యను ఒప్పించాడు !

Published on Mar 4, 2020 8:30 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య – బోయపాటి చిత్రానికి కెమెరామెన్ గా సీనియర్ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ స్థానంలో మరో కెమెరామెన్ ను తీసుకోవాలని మొదట బాలయ్య నిర్ణయించారు. రూలర్ సినిమా విషయంలో రామ్ ప్రసాద్ పనితనం బాగాలేదనే ఈ సినిమా నుండి అతన్ని తప్పించాలని బాలయ్య భావించనప్పటికీ.. బోయపాటి బాలయ్యను కన్వీన్స్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ ప్రసాద్ అయితేనే వర్క్ స్పీడ్ గా అవుతుందని బోయపాటి బాలయ్యను ఒప్పించారట.

ఇక నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. మే లో ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడట. శ్రీకాంత్ ఇంతకు ముందు నాగచైతన్య ‘యుద్ధం శరణం’లో విలన్ గా నటించాడు. కాగా ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు