బాలయ్య – బోయపాటి సినిమాలో బాలయ్య బాబు డబుల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్మలు చిన్నతనంలోనే విడిపోగా వారిలో ఒకరు అఘోరాగా మారతాడట. అయితే, అఘోరా అంటే ఒంటి నిండి బూడద పూసుకుని, గోచీలు పెట్టుకుని జడలు పెరిగిన జుట్టుతో కనిపించాలి. ఆ గెటప్ లో బాలయ్యను ఫ్యాన్స్ చూడటానికి ఇష్టపడరు కాబట్టి పంచె, లాల్చీలో బాలయ్యను చూపిస్తున్నారుట.
త్వరలో మొదలు కానున్న కొత్త షెడ్యూల్ లో అఘోర పాత్రకు సంబధించిన సీక్వెన్స్ లు తీయనున్నారు. కథకు చాలా కీలకమైనవి అట. పైగా స్క్రిప్ట్ లో అఘోర పాత్రకు సంబధించిన సీక్వెన్స్ లు చాల బాగుంటాయట, ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించాడు, కాకపోతే ఈ సారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలంటే బోయపాటి ఏదైనా కొత్తగా చేయాలి. మరి బాలయ్యకు బోయపాటి హిట్ ఇస్తాడో..లేదో చూడాలి.


