NBK 109: బాలయ్య క్రేజీ కామెంట్స్ వైరల్

NBK 109: బాలయ్య క్రేజీ కామెంట్స్ వైరల్

Published on May 25, 2024 8:09 AM IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాలీవుడ్ స్టార్స్ ఊర్వశి రౌటేలా (Utvashi Rautela) అలాగే బాబీ డియోల్ (Bobby Deol) లతో దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “బాలయ్య 109” కోసం తెలిసిందే. మరి ఆల్రెడీ సాలిడ్ గ్లింప్స్ తో అందరిలో మంచి అంచనాలు ఈ సినిమాపై నెలకొనగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

అయితే ఎన్నికల అనంతరం బాలయ్య షూటింగ్ లో వెంటనే జాయిన్ అయ్యిపోయారు అని ఓ టాక్ వచ్చింది. అయితే దీనిపై అసలు విషయాన్ని బాలయ్య లేటెస్ట్ గా రివీల్ చేశారు. తాను ఎన్నికల తర్వాత వెంటనే షూటింగ్ లో జాయిన్ లో అయ్యిపోవాలని వచ్చేసాను అని కానీ ఆ షూటింగ్ ఇంకా మొదలు కాలేదని అందుకే ఈ గ్యాప్ లో కాజల్ “సత్యభామ” కోసం వచ్చానని అసలు విషయం రివీల్ చేశారు.

సో దీనితో బాలయ్య ఇంకా ఈ సినిమా షూట్ లో పాల్గొనలేదని చెప్పాలి. అయితే తాను ఈ రెండు నెలలు కెమెరాని బాగా మిస్ అయ్యానని ఇప్పుడు సంతోషంగా ఉందని తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు