నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రమే అఖండ 2 (Akhanda 2). కొన్నేళ్ల కితం వచ్చి సంచలన విజయం సాధించిన అఖండ 1 కి సీక్వెల్ గా ఈసారి తాండవం అంటూ వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే జరిగిన అంత నెగిటివ్ లో కూడా బాలయ్య రికార్డులు సెట్ చేశారు.
యూఎస్ మార్కెట్ లో వరుస 5 మిలియన్ సినిమాలు
బాలయ్యకి అఖండ 1 తో మొదలైన విజయాల పరంపర మెయిన్ గా యూఎస్ మార్కెట్ లో 1 మిలియన్ గ్రాస్ వసూళ్లు హవా ఇప్పుడు అఖండ 2 తో సెన్సేషన్ గా మారింది మొత్తం 5 సినిమాలూ వరుసగా 1 మిలియన్ మార్క్ ని నార్త్ అమెరికాలో అందుకున్నాయి. (అఖండ 1, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్,అఖండ 2 ) ఇలా నాలుగు వరుస సినిమాలు 1 మిలియన్ మార్క్ దాటడం అనేది వెరీ రేర్.
మొత్తం 6 సినిమాలతో సీనియర్ హీరోస్ లో బాలయ్యదే పైచేయి..
మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో ఇప్పుడు బాలయ్య నార్త్ అమెరికా వసూళ్లలో ముందున్నారని చెప్పొచ్చు. అక్కడ లాస్ట్ 5 సినిమాలు మాత్రమే కాకుండా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో మొత్తం 6, మిలియన్ సినిమాలు ఉన్న ఏకైక సీనియర్ హీరోగా యూనిక్ ట్రాక్ రికార్డు తాను సొంతం చేసుకున్నారు.


