స్క్రిప్ట్ విన్న బాలయ్య.. సెకండ్ హాఫ్ లో మార్పులు చేర్పులు !

నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్నారు. కాగా ఈ మూవీని భారీ సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో, మల్టిపుల్ టైమ్‌లైన్స్, పునర్జన్మలు, భారీ విఎఫ్ఎక్స్ వంటి అంశాలతో రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సినిమాలో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే టాక్ వచ్చింది. తాజాగా బాలయ్య ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ విన్నారని.. సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు చెప్పారని తెలుస్తోంది.

ఇక మోక్షజ్ఞ – వశిష్ఠ కాంబినేషన్‌పై నెగిటివ్ టాక్ రావడానికి మరో ముఖ్య కారణం.. వశిష్ఠకు ఇప్పటివరకు ‘బింబిసార’ ఒక్కటే పూర్తిస్థాయి విజయం. అటు ‘విశ్వంభర’పై వచ్చిన చర్చ కూడా ఈ అనుమానాలకు కారణంగా కనిపిస్తోంది. అయితే మోక్షజ్ఞను రొటీన్ మాస్ కథతో కాకుండా కొత్త కాన్సెప్ట్‌తో లాంచ్ చేయాలనే ఉద్దేశంతోనే వశిష్ఠను ఎంచుకున్నారనే టాక్ ఉంది. అదే నిజమైతే, “వశిష్ఠ కరెక్ట్ ఛాయిస్ అనుకోవాలేమో. ఏది ఏమైనా సినిమా ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చాకే ఈ సినిమా ఎలా ఉండబోతుందో స్పష్టమవుతుంది.

Exit mobile version