‘నటరత్న, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో తెరెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బయోపిక్ ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో 60 విభిన్న గెటప్ లలో బాలకృష్ణ కనిపించనున్నారు.
అయితే అరవై గెటప్ ల్లో వెంకటేశ్వర స్వామి అవతారంలో బాలయ్య కనిపించే గెటప్ ఒకటి. తాజాగా వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న బాలయ్య పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ పోస్టర్ నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. స్వామి అవతారంలో బాలయ్య చాలా బాగున్నారని, అలాగే స్వామి అవతారంలో.. అచ్చం ఎన్టీఆర్ లానే ఉన్నారని.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


