స్పై క్యారెక్టర్ లో ‘బాలయ్య’ !

Published on Dec 27, 2020 1:00 am IST

‘బాలయ్య – బి గోపాల్’ సూపర్ హిట్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి గానీ, ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే, తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఉంటుందని.. సినిమాలో బాలయ్య స్పై క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. బాలయ్య శైలిలోనే సినిమా సాగుతూ కాస్త కొత్తగా కూడా ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకుందట. ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రాతో పాటు ఆకుల శివ కూడా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారట. మరి బాలయ్య కోసం పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని మలుస్తున్నారట.

నిజానికి ఈ సినిమా క్యాన్సల్ అయినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు అవాస్తవం అని తేలిపోయింది. ఇక బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలు బి గోపాల్ డైరెక్ట్ చేసినవే. అందుకే ‘బాలయ్య – బి గోపాల్’ కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో మంచి ఆసక్తి ఉంటుంది.

సంబంధిత సమాచారం :