కొత్త గెటప్ లో బాలయ్య !

కొత్త గెటప్ లో బాలయ్య !

Published on Feb 27, 2021 11:14 AM IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న యాక్షన్ సినిమాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాల షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సన్నివేశాల్లో బాలయ్య కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడని, డెబ్భై ఏళ్ల ముసలాడి గెటప్ లో బాలయ్య కనిపించబోతున్నాడు. ఇక బాలయ్య ఈ సినిమాలో తన స్టైల్ ను పూర్తిగా మార్చాలనుకుంటున్నాడట. ముఖ్యంగా తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్య మార్పు చూపించాలనుకుంటున్నాడట.

మొత్తానికి బాలయ్య అభిరుచికి తగ్గట్లు యాక్షన్ లో కొత్తదనం పెడుతున్నారట. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా ప్రధాన ప్రతినాయకుడు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు టీమ్. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు