బాలయ్య కోసం వెయిటింగ్ లో ఇద్దరు దర్శకులు !

Published on Feb 28, 2021 10:05 pm IST

దర్శకుడు శ్రీవాస్ దర్శకుడిగా స్టార్ రైటర్ ఎమ్ రత్నం ఓ కథను సిద్ధం చేశారు. అయితే ఈ కథను నటసింహం నందమూరి బాలయ్య బాబు కోసం రాశారట. ఎమ్ రత్నం తన స్క్రిప్ట్ ను బాలయ్యకు చెప్పారని.. బాలయ్యకు కూడా కథ నచ్చిందని.. ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. మరి ఇప్పటికే బాలయ్య వరుస సినిమాలను ఒప్పుకుంటున్నాడు.

క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఆల్ రెడీ ఒక సినిమాని ప్లాన్ చేసాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బాలయ్య ఫుల్ బిజీగా ఉన్నాడు. బాలయ్యకు పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో బోయపాటి ఈ సినిమా చేస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే టీజర్ లో మాత్రం బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో… పైగా పంచ కట్టులో వైట్ అండ్ వైట్ లో అభిమానులను బాగానే అలరించారు. మరి ఈ సినిమా పూర్తి అయ్యాక, బాలయ్య… గోపీచంద్ తో సినిమా చేస్తాడా ? లేక శ్రీవాస్ తో సినిమా చేస్తాడా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :