మరోసారి ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ?

Published on Nov 21, 2019 3:00 am IST

దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్న ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. అయితే జయలలిత జీవితంలో ఎం.జి.ఆర్, కరుణానిధి ముఖ్యమైన భూమిక పోషించారు. ఇప్పటికే ఎం.జి.ఆర్ గా అరవింద స్వామిని మరియు కరుణానిథిగా ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేసింది చిత్రబృందం.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించే అవకాశం ఉంది. అయితే మొదట జూనియర్ ఎన్టీఆర్ ను చిత్రబృందం సంప్రదించినా తారక్ ఆసక్తి చూపలేదట. మరి బాలయ్య అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జయలలిత జీవితంలో మరో కీలకమైన పాత్ర అలనాటి అందాల హీరో శోభన్ బాబుది. మరి శోభన్ బాబు పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More