బాలయ్య వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందా?

Published on May 29, 2020 10:33 pm IST

మరోసారి మన టాలీవుడ్ లో రీమేక్ ల పర్వం కాస్త ఊపందుకుంది. అలా ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ ఓకే అంటే ఓ రీమేక్ అందులోను మల్టీ స్టారర్ పట్టాలెక్కకుంది. మలయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియం” చిత్రాన్ని తెలుగులో రీమేక్ రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే ఆ సినిమాకు రీమేక్ లో భాగంగా బిజ్జు మీనన్ రోల్ కు గాను బాలయ్య పేరు పృథ్వీ రాజ్ పాత్రకు గాను మాస్ మహారాజ్ పేర్లు వినిపిస్తుండగా.. ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కేందుకు బాలయ్యే ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉందట. తాను ఇంకా ఈ చిత్రం చూసాక మరల నిర్మాతలతో సంప్రదింపులు జరిపి ఏదో ఒకటి చెప్తే అప్పుడు ఈ చిత్రం మొదలు కానుంది అని తెలుస్తుంది. అందుకే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు బాలయ్య నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారట.

సంబంధిత సమాచారం :

More