‘డిక్టేటర్’గా రానున్న బాలయ్య?

‘డిక్టేటర్’గా రానున్న బాలయ్య?

Published on Feb 2, 2015 10:22 PM IST

balayya-lion
నందమూరి బాలకృష్ణ 99వ సినిమా శ్రీవాస్ దర్శకత్వంలో వుండనుందని మేము ముందుగానే తెలిపాం. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘డిక్టేటర్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. బాలయ్య ఇమేజ్ కు సరిపడేలా ప్రముఖ రచయితలూ కోనా వెంకట్, గోపీ మోహన్ లు స్క్రిప్ట్ ని సన్నద్ధం చేస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సింహా, లెజెండ్, లయన్ ఇలా వరుసపెట్టి బాలయ్య పవర్ ఫుల్ టైటిళ్ళతో దూసుకుపోతున్నాడు. ఇక ఈ 99వ సినిమాకు డిక్టేటర్ అనే నామకరణం చేస్తే బాలయ్య అభిమానుల ఆనందాలకు అవధులు వుండవు.

నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలో షూటింగ్ ప్రారంభంకానుంది. మరిన్ని వివరాల కోసం మా సైట్ చదువుతూ వుండండి.

తాజా వార్తలు