సాంగ్స్ తో మొదలెట్టనున్న బాలయ్య !

సాంగ్స్ తో మొదలెట్టనున్న బాలయ్య !

Published on Aug 5, 2019 7:22 AM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. కనుక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు సోనాల్ చౌహాన్ అండ్ వేదిక నటించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ వచ్చే వారం నుండి బ్యాంకాక్‌ లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య – సోనాల్ చౌహాన్ మరియు వేధికల సాంగ్స్ ను షూట్ చేయనున్నారు.

అయితే సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్, డిక్టేటర్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘డిక్టేటర్’ తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు