రజినీ సినిమాకు ‘భరత్ అనే నేను’ సినిమాటోగ్రఫర్ !
Published on May 18, 2018 11:00 am IST


సూర్య నటించిన’ 24′ సినిమాకు ఉత్తమ సినిమాటోగ్రఫర్ గా నేషనల్ అవార్డును గెలుచుకున్నారు సినిమాటోగ్రఫర్ తిరునవుకరసు. ‘భరత్ అనే నేను, జనతా గ్యారేజ్’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసి ‘తిరు’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
.
ఇకపోతే ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్ నటించబోయే సినిమాకు కెమెరామెన్ గా పనిచేయనున్నాడు. రజినీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో తిరుకి ‘రోబో’ సినిమాకు అవకాశం వచ్చినా బిజీ షెడ్యూల్ కారణంగా వదులుకోవాల్సివచ్చింది. మళ్ళీ ఇప్పుడు రజనీతో పనిచేసే అవకాశం రావడం పట్ల ఆయన సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook