అమెజాన్ ప్రైమ్ లో ‘భరత్ అనే నేను’!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం జూన్ 9వ తేదీతో 50 రోజులను పూర్తిచేసుకోనుంది. అదే రోజు అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం అమెజాన్ లో వ్యూవర్ షిప్ పరంగా కూడా రికార్డులను క్రియేట్ చేస్తుందని ప్రైమ్ నిర్వాహకులు భావిస్తున్నారు.

ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో కలెక్షన్ల పరంగా 3వ స్థానంలో కొనసాగుతోంది. గత రెండు సంవత్సరాలుగా సరైన హిట్ లేని మహేష్ కు ఈ చిత్రం మంచి పుష్ ఇచ్చినట్లైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కైరా అధ్వాని కథానాయికగా నటించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version