మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘బందిపోటు’. ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. త్వరలో సాంగ్స్ షూటింగ్ కోసం ఇటలీ, స్పెయిన్ వెళ్లనున్నారు. అక్కడ అందమైన లొకేషన్లలో హీరో హీరోయిన్లపై రొమాంటిక్ సాంగ్స్ షూట్ చేయనున్నారు. నవంబర్ 24 వ తేదితో సినిమా షూటింగ్ పూర్తవుతుందని యూనిట్ వర్గాలు తెలిపాయి.
దొంగలను దోచుకునే ఘరానా దొంగగా అల్లరి నరేష్ ఈ సినిమాలో నటిస్తున్నారు. నరేష్ సరసన ఈషా జంటగా నటించింది. శ్రద్ధా దాస్ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. ఐటెం సాంగుతో పాటు మరికొన్ని సన్నివేశాలలో శ్రద్ధా కనిపించనుంది. శ్రీనివాస్, సంపుర్ణేష్ బాబులు ముఖ్య పాత్రలలో నటించారు. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు. అల్లరి నరేష్ కెరీర్ లో భారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. సుమారు 10.5 కోట్ల రూపాయలతో ఇ.వి.వి. సినిమా పతాకంపై నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


