
అల్లరి నరేష్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘బందిపోటు’ అనే కామెడి ఎంటర్టైనర్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసినదే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ‘యు/ఏ’ సర్టిఫికేట్ ని అందుకుని ఈ నెల 20న విడుదలకు సిద్ధపడుతుంది.
అల్లరి నరేష్ సొంత బ్యానర్ లో విడుదలకానున్న ఈ సినిమాపై మన హీరో చాలానే ఆశలు పెట్టుకున్నాడు. మాకందిన సమాచారం ప్రకారం ఈ సినిమా తెరకెక్కిన విధానంపై బృందం కాన్ఫిడెంట్ గా వున్నట్టు తెలుస్తుంది. మరి నరేష్ ని ఊరిస్తున్న హిట్ ఈ చిత్రంతో రావాలని కోరుకుందాం..