‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’తో సక్సెస్ అందుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘బందిపోటు’. ఈ సినిమా ఆడియో వేడుకని జనవరి 11న లాంచ్ చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం జనవరి 30న సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ తో పాటు మిగిలి ఉన్న రెండు సాంగ్స్ షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది.
న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నరేష్ ఈ సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తూనే ఇంతక ముందు చేయని ఓ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నరేష్ సరసన ఈషా జంటగా నటించిన ఈ సినిమాలో శ్రద్ధా దాస్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు. ఇ.వి.వి. సినిమా పతాకంపై నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


