ఫిబ్రవరి 3వ వారంలో ‘బందిపోటు’..!

ఫిబ్రవరి 3వ వారంలో ‘బందిపోటు’..!

Published on Feb 5, 2015 4:53 PM IST

Bandipotu
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘బందిపోటు’. మొదట ఫిబ్రవరి 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే, సినిమా విడుదల రెండు వారాలు వాయిదా పడే అవకాశం ఉందని 123తెలుగు.కామ్ గతంలో తెలియజేసింది. అర్బన్ బేస్డ్ క్రైమ్ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 20న విడుదల చేస్తున్నట్టు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెలిపారు.

బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో తొలిసారి నరేష్ ను పూర్తిగా సరికొత్తగా చూపించారు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్ ప్రోమోలు చాలా క్లాసీగా ఉన్నాయి. నరేష్ సరసన ‘అంతక ముందు ఆ తర్వాత’ ఫేం ఈషా జంటగా నటించిన ఈ సినిమాలో, శ్రద్ధా దాస్ ప్రత్యేక పాత్రలో నటించింది. ఓ స్పెషల్ సాంగులో శ్రద్ధా సందడి చేయనుంది. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు. ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ ఈ సినిమాను నిర్మించారు.

తాజా వార్తలు