అల్లరోడి ‘బందిపోటు’ 2 వారలు వెనక్కి వెళ్లనుందా.?

Bandipotu
‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’తో సక్సెస్ అందుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేసిన సినిమా ‘బందిపోటు’. ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని ముందుగా ఫిబ్రవరి 6న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు. కానీ ఈ రోజు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అనుకున్న తేదీకి 2 వారాలు ఆలస్యంగా ఫిబ్రవరి 20న ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉన్నట్లు సమాచారం.

బందిపోటు టీం ఈ సినిమాని బాక్స్ ఆఫీసు వద్ద సోలోగా రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నరేష్ ఈ సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తూనే ఇంతక ముందు చేయని ఓ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నరేష్ సరసన ఈశ జంటగా నటించిన ఈ సినిమాలో శ్రద్ధ దాస్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు. ఇ.వి.వి. సినిమా పతాకంపై నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version