ఫిబ్రవరి మొదటివారంలో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటి చోటు చేసుకోనుంది. కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన ‘బందిపోటు’.. ఒకప్పటి యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ నటించిన ‘గడ్డం గ్యాంగ్’ సినిమాలు ఫిబ్రవరి 6న విడుదల కానున్నాయి. ఈ హీరోలిద్దరూ తమ ఇమేజ్ పక్కన పెట్టి, భిన్నమైన కథలలో నటించారు.
‘సుడిగాడు’ నరేష్ సినిమాలంటే పేరడీ కామెడీ కంపల్సరీ. లో బడ్జెట్ సినిమాలలో ఈ పేరడీ కామన్ కావడం, ప్రయోగాలు వికటించి పరాజయాలు పలకరించడంతో అల్లరి నరేష్ రూట్ మార్చాడు. ‘బందిపోటు’లో ఒక్క పేరడీ, స్పూఫ్ కామెడీ సన్నివేశాలు లేకుండా చూసుకున్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అల్లరోడిని చాలా క్లాస్ లుక్ లో చూపించారు. ‘మనసున్న మారాజు’, ‘సింహరాశి’, ‘ఆహుతి’, ‘ఎవడైతే నాకేంటి’ ఇలా రాజశేఖర్.. అయితే ఫ్యామిలీ, లేదా సీరియస్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలలో నటిస్తూ వచ్చాయి. గత ఐదేళ్ళుగా ఎదురైన ప్లాప్ సినిమాలు రాజశేఖర్ ను ఆలోచనలో పడేశాయి. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు అని గమనించి తమిళంలో హిట్టయిన ‘సూదు కవ్వమ్’ను రీమేక్ చేశారు.
ఒకేరోజు విడుదలవుతున్న ఈ రెండు సినిమాలు హీరోలకు ఎటువంటి ఫలితాలను అందిస్తాయో.


