సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాల పై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జనవరి 5న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ మెగా సూపర్ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా… బండ్లగణేశ్ మాట్లాడుతూ – “మహేశ్‌బాబు `సరిలేరు నీకెవ్వరు` సినిమా ఏంటో టైటిల్లోనే చెప్పారు. ఈ సంక్రాంతికి అదే జరగబోతుంది. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున మనసున్న మెగాస్టార్ చిరంజీవిగారు ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వచ్చి తెలుగు చలన చిత్ర పరిశ్రంలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అనిల్ రావిపూడి నాకు ఈ సినిమాలో గమ్మత్తైన వేషం ఇచ్చారు. ఇకపై నేను ప్రేక్షకులను ఎంటర్ చేయాలనే నిర్ణయించుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత అనిల్‌గారికి, దిల్‌రాజుగారికి థ్యాంక్స్. ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. మహేశ్ కెరీర్‌లోనే కాదు.. ఇండస్ట్రీలోనే నెంబర్‌వన్ సినిమాగా నిలుస్తుంది“ అన్నారు.
పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ – “మహేశ్ గారి మీద ఈ టైటిల్ పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడే సినిమా సక్సెస్ అయ్యింది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథను అనిల్ నాకు వివరించారు. విజయశాంతిగారు, ప్రకాశ్‌రాజు, రాజేంద్ర ప్రసాద్, దేవిశ్రీ ప్రసాద్‌గారు, రత్నవేలుగారు ఇలాంటి బ్రహ్మాండమైన టీమ్‌తో సినిమా చేశారు. ఇక అనిల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించడంలో మంచి పేరు సంపాదించుకున్నారు. అన్ని ఎలిమెంట్స్‌ను చక్కగా మిక్స్ చేసి చేసిన సినిమా ఇది. బ్లాక్‌బస్టర్ కంటే పెద్ద పదమేదైనా ఉందంటే అలాంటి పండగ ఈ పండక్కి రాబోతుందని భావిస్తున్నాను. ఈ సినిమాలో రెండు పాటలను రాశారు. మహేశ్‌బాబుగారి ఫ్యాన్స్‌కి, పాటలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను“ అన్నారు.


