నా దేవర, నా దేవుడు.. పవన్‌పై బండ్ల హైవోల్టేజ్ డైలాగ్.!

Published on Jul 6, 2021 2:33 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కూడా ఒకడు. పవన్ అంటే బండ్ల గణేశ్‌కు పిచ్చి అభిమానం. ఎంతలా అంటే పవనే నా దేవుడు, నా సర్వస్వం, నా ఆస్తి అనేంతలా. అయితే ఎప్పటికప్పుడు తన మాటలతో పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకునే బండ్ల గణేశ్ తాజాగా ఓ హై వోల్టేజ్ డైలాగ్‌తో వారెవ్వా అనిపించాడు.

స్టార్ మాలో ప్రముఖ యాంకర్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 4లో భాగంగా ఈ వారంలో వచ్చే ఎపిసోడ్‌కు బండ్ల గణేశ్ వచ్చాడు. ఇందులో పవర్ స్టార్ ప్రస్తావన రాగా అప్పుడు బండ్ల గణేశ్ మాట్లాడుతూ నా ధేవర, నా దేవుడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకొస్తూనే ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ చెప్పిన డైలాగ్ పవన్ అభిమానులకు హై వోల్టేజ్ కిక్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఈక్ ఈ షోకు బండ్లతో పాటు యానీ మాస్టర్, నందిత శ్వేత, జియా మరియు వారి వారి పిల్లలు వచ్చి సందడి చేశారు. మరీ ఈ ఎంటర్‌టైన్మెంట్‌ను మిస్ కాకూడదంటే మాత్రం ఈ వీకెండ్ స్టార్ మాలో వచ్చే సిక్స్త్ సెన్స్ ఎపిసోడ్‌ను తప్పక చూడాలండోయ్.

సంబంధిత సమాచారం :