పిక్ టాక్ : మహేష్ బాబు ఫ్యామిలీతో బండ్ల గణేష్

పిక్ టాక్ : మహేష్ బాబు ఫ్యామిలీతో బండ్ల గణేష్

Published on Jul 23, 2026 10:54 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌లను ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన భార్యతో కలిసి మహేష్ బాబు నివాసానికి వెళ్లిన బండ్ల గణేష్ తమ కుటుంబంలో జరగబోయే వివాహ వేడుకకు ఆహ్వానించారు. బండ్ల గణేష్ కూతురు జనని వివాహవేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఈ సందర్భంగా ఆయన మహేష్ బాబుకు అందజేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో మహేష్ బాబు సరికొత్త లాంగ్ హెయిర్, గడ్డంతో ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. ‘బిజినెస్ మేన్’ వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు – బండ్ల గణేష్ కలయికకు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో సూపర్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు