‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్రం నుండి రాజ్ కిరణ్ ని తీసేయడంపై స్పందించిన బండ్ల గణేష్

‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్రం నుండి రాజ్ కిరణ్ ని తీసేయడంపై స్పందించిన బండ్ల గణేష్

Published on Jun 14, 2014 11:31 PM IST

bandla-ganesh
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్రం లో తమిళ యాక్టర్ రాజ్ కిరణ్ పాత్ర కి వేరే వారిని తీసుకోవడం పై వస్తున్నకాంట్రవర్సిలను సర్దిపుచ్చారు.

రాజ్ కిరణ్ రామ్ చరణ్ తాత పాత్రని పోషించవలసి వుండగా ఒక 20 రోజుల షూటింగ్ తర్వాత ఆ పాత్రకి ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారు. అప్పట్నుంచి ఈ విషయం పై ఎన్నోవార్తలు వ్యాపిస్తున్నాయి.

ఈరోజు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సమావేశం లో రాజ్ కిరణ్ ని ఇబ్బంది పెట్టినందుకు బండ్ల గణేష్ క్షమాపణలు తెలిపారు. రాజ్ కిరణ్ కి తెలుగు నేటివిటీ లోపించిందని మొత్తం ‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్రం టీం కి అనిపించడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని తెలిపారు.

రాజ్ కిరణ్ ని ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు. ప్రకాష్ రాజ్ ఈ పాత్ర కి ఇంకా బాగా సరిపోతారు చిత్రం ఇంకో లెవెల్ కి వెళ్ళడానికి ఖచ్చితంగా సహాయపడతారు అనే తెలిపారు.

అక్టోబర్ 1 న విడుదల కానున్న ‘గోవిందుడు అందరి వాడెలే’ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు